ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షురూ | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షురూ

Feb 3 2026 7:29 AM | Updated on Feb 3 2026 7:29 AM

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షురూ

ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ షురూ

ఆదిలాబాద్‌టౌన్‌: ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో 16 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు డీఐఈ వో జాదవ్‌ గణేశ్‌కుమార్‌ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మ ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వర కు రెండు సెషన్లలో నిర్వహించారు. ఉదయం జనరల్‌ విభాగంలో 941 మందికి గాను 856 మంది హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 605 మందికిగాను 578 మంది హాజరైనట్లు పే ర్కొన్నారు. మధ్యాహ్నం న్విహించిన పరీక్షకు జనరల్‌ విద్యార్థులు 947 మందికి గాను 889 మంది హాజరు కాగా, 58 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పలు పరీక్ష కేంద్రాలను డీఐఈవోతో పాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు తనిఖీలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement