బాసర ఆలయానికి రూ.1.55కోట్ల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

బాసర ఆలయానికి రూ.1.55కోట్ల ఆదాయం

Feb 10 2026 7:34 AM | Updated on Feb 10 2026 7:34 AM

బాసర ఆలయానికి రూ.1.55కోట్ల ఆదాయం

బాసర ఆలయానికి రూ.1.55కోట్ల ఆదాయం

బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పరిసరాల్లో వివిధ దుకాణాలకు సోమవారం అధికారులు బహిరంగ, సీల్డ్‌ టెండర్లు నిర్వహించారు. ఘాట్‌ వద్ద పూజా సామగ్రి విక్రయానికి రూ.35.11 లక్షలు, ఆలయ ఆవరణలోని దుకాణానికి రూ.38.88 లక్షలు, వెయ్యి రూపాయల అక్షరాభ్యాస మండపంలో భక్తుల ఫొటోలు తీసేందుకు రూ.40.16 లక్షలు, 150 రూపాయల మండపంలో ఫొటోలు తీసేందుకు రూ.41.70 లక్షలకు వ్యాపారులు టెండర్లు దక్కించుకున్నారు. 4 విభాగాల్లో జరిగిన వేలంలో ఆలయానికి రూ.1,55,85,888 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు.

హుండీ లెక్కింపు వాయిదా

బాసర ఆలయంలో నేడు నిర్వహించనున్న హుండీ లెక్కింపును కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా చేసినట్లు ఈవో అంజనాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రెండుసార్లు వాయిదా పడినట్లు ఆమె పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement