● ప్రతీ వార్డుపై నిశితంగా ఫోకస్ ● సర్పంచులకు వార్డుల బ
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని టీపీసీసీ క్షేత్రస్థాయిలో ప్రత్యేక టాస్క్ రూపొందించింది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే క్షేత్రస్థాయిలో నిశితంగా దృష్టి సారించేందుకు పార్టీ పెద్దలు వ్యూహరచన చేశారు. ప్రతీ వార్డులో జరిగే రోజువారీ
పరిణామాలను పర్యవేక్షిస్తున్నారు. లోపాలున్నచోట దిద్దుబాటు చర్యలు తీసుకునేలా వడివడిగా కదులుతున్నారు. ఒక్కోవార్డు నుంచి మొత్తం మున్సిపాలిటీలోని పరిస్థితులను ఎ ప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ప్రతీ అంశాన్ని పరిశీలిస్తూ పార్టీ అభ్యర్థులు, నాయకుల పనితీరుపై నిత్యం గాంధీభవన్‌కు నివేదిక తెప్పించుకునేలా మానిటరింగ్ చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు
జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీ ఆదిలాబాద్‌లో ఎలా గైనా గెలిచేలా టీపీసీసీ అమలు చేస్తున్న టాస్క్ క్షేత్రస్థాయిలో పకడ్బందీగా కొనసాగుతోంది. స్కూల్‌లో విద్యార్థికిచ్చే హోంవర్క్‌లా ఈ టాస్క్ అమలవుతున్నట్లు కాంగ్రెస్ నాయకుడొకరు అభిప్రాయపడడం ఇందుకు నిదర్శనం. ఎన్నికల్లో గెలవాలని చెప్పడం కాకుండా పైనుంచే ప్రక్రియ ఇలా ఉండాలని, దాని కి అనుగుణంగా ప్రతీ స్థాయిలో నాయకులు కష్టపడాల్సిందేనని అధిష్టానం స్పష్టం చేసింది. ఈ విధంగా ఏ వార్డులోనైనా లోపాలుంటే.. ఏ విధంగా సరి దిద్దాలో కూడా అప్పటికప్పుడు పైనుంచి ఆదేశాలి స్తోంది. ఇందుకు అనుగుణంగా స్థానిక బాధ్యులు క్షే త్రస్థాయిలో ముందుకెళ్తున్నారు. ఇలా బల్దియా ఎ న్నికల్లో గెలుపే లక్ష్యంగా హస్తంబ్యాచ్ పనిచేస్తోంది.
ప్రతీ వార్డుపై ప్రత్యేక దృష్టి
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులుండగా, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలిచిన వారిలో కొంతమంది నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి ఒక్కొక్క వార్డుకు ఇన్‌చార్జిగా నియమించారు. వీరు ఆ వార్డులో జరిగే పరిణామాలను కింది స్థాయి వరకు గమనిస్తున్నారు. ప్రచారం నుంచి మొదలుకుంటే ఓటర్ల నాడీ గుర్తించేవరకు ఇలా అన్ని అంశాల్లో వీరు సూక్ష్మంగా దృష్టి సారిస్తున్నారు. సర్పంచులపై పర్యవేక్షణ కోసం ప్రతీ నాలు గైదు వార్డులకు కలిపి జిల్లా నాయకులను కో కోఆరి నేటర్లుగా నియమించారు. వీరిలో గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, అల్లూరి సంజీవ్‌రెడ్డి, మల్లెపూల నర్సయ్య, అడ్డి భోజా రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గోక గణేశ్‌రెడ్డి, ముడుపు దా మోదర్‌రెడ్డి, బాలూరి గో వర్ధన్‌రెడ్డి, ఏలేటి అశ్విన్‌రెడ్డి, కుమ్రం కోటేశ్, బొ డ్డు గంగారెడ్డి, అశోక్‌రెడ్డి, బాబన్న, కొండ గంగాధర్, భూపెల్లి శ్రీధర్ ఉన్నా రు. వీరికి సబ్ కోఆర్డినేటర్లుగా మరి కొంతమందిని నియమించారు. వీ రందరిపై పర్యవేక్షణకు టీపీసీసీ నుంచి ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్‌ను కోఆర్డినేటర్‌గా గురువారం నియమించారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా ఆయన ఆదిలాబాద్‌లోనే ఉండనున్నట్లు పార్టీ జిల్లా నాయకులు తెలిపారు. ఇక వీరందరి నుంచి వార్డుల వారీగా వచ్చే రిపోర్టులను డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్ పరిశీలించి రోజువా రీగా గాంధీభవన్‌కు పంపిస్తారు.
నేడు ఏఐసీసీ నేత రాక
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఉండగా, ఆమెకు సహాయకులుగా ప్రస్తుతం ఏఐసీసీ సెక్రటరీలుగా ఇద్దరు పని చేస్తున్నారు. వీరికి రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల పరిధిలోని మున్సిపాలిటీల బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు తమ పరిధిలోకి వచ్చే మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితులపై పరిశీలన కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ మున్సిపాలిటీకి ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ రానున్నారు.
28 వార్డుల్లో బలంగా..
ప్రతీ స్థాయిలో సూక్ష్మంగా ఫోకస్ పెట్టి ఇప్పటివరకు 28వార్డుల్లో బలంగా ఉన్నట్లు డీసీసీ గాంధీ భవన్‌కు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. మిగతా వార్డుల్లోనూ లోపాలను సరిదిద్దుకుని ముందుకెళ్తే ఫలితం సాధిస్తామని అధిష్టానానికి తెలియజేసినట్లు కొంతమంది నాయకులు తెలిపారు. అధికార కాంగ్రెస్ ప్రతీ మున్సిపాలిటీలో గెలుపును సవాల్‌గా తీసుకుని ముందుకు కదులుతుండటం, అందులో భాగంగా టీపీసీసీ టాస్క్ ప్రకారం వెళ్తుండడంతో ఈ ఫలితాలు ఎలా ఉంటాయనేది కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
● ప్రతీ వార్డుపై నిశితంగా ఫోకస్ ● సర్పంచులకు వార్డుల బ


