బాసర: బాసర ఆర్జీయూకేటీలో విద్యా వారోత్సవా ల్లో భాగంగా శనివా రం గ్రంథాలయ ది నోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రవేశ పరీక్షలకు, ఇంజినీరింగ్, సైన్స్, సా హిత్య విషయాలకు సంబంధించి నూతన పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత ప్రభుత్వ ఐఐటీ స్థాయిల పరిశోధనా పత్రాలు విద్యార్థులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. డిజిటల్ గ్రంథాలయం ద్వారా 10 కోట్లకు పైగా పుస్తకాలు, ఆడియో–వీడియో వనరులు ఒక్క క్లిక్‌లో పొందేమని ఆయన వివరించారు. విద్యార్థులు, అధ్యాపకులు ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలంటూ సలహా అందించారు. ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ. మురళీ దర్శన్ మాట్లాడుతూ డిజిటల్ వనరులను ఎలా ఉపయోగించుకోవాలో సాధనాత్మక సూచనలు ఇచ్చారు. పుస్తక ప్రదర్శనలో ఇంజనీరింగ్, శాస్త్ర, సాహిత్య, పోటీ పరీక్షల సంభంధిత తాజా నోట్‌లు, పుస్తకాలు ప్రదర్శనకు ఉంచారు. గ్రంథాలయాధికారి డాక్టర్ కే.అరుణ జ్యోతి స్వాగత ప్రసంగంలో పుస్తకదానానికి ప్రోత్సాహం ఇచ్చి ‘పుస్తకదానం చేయండి.. అక్షరజ్ఞానం పంచండి‘ అంటూ పాఠకులకు ఆహ్వానం పలుకారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్స్ ప్లానింగ్ శేఖర్ శీలం, అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్.విఠల్, దేవరాజ్, గ్రంథాలయ సిబ్బంది అర్చన, సునీత, అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.


