ఆదిలాబాద్‌టౌన్: సీసీఐ పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట జాతీయ రహదా రిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కోకన్వీనర్ కొండా రమేశ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ తె లంగాణకు టూరిస్టులా వచ్చి వెళ్లడం కాకుండా నిధులు, కొత్త ప్రాజెక్టులు ప్రకటించాలని డి మాండ్ చేశారు. జిల్లాలో ఉన్న ఏకై క కేంద్ర ప్ర భుత్వరంగ సంస్థ అయిన సీసీఐని వెంటనే తెరిపించాలని కోరారు. లేకుంటే నిర్వాసిత రై తులకు భూములు తిరిగి అప్పగించాలన్నారు. ఇందులో రమేశ్, పోశెట్టి, దత్తాత్రి, జగన్ సింగ్, ఈశ్వర్ దాస్, సచిన్, మంజుల, జి.సుభాష్, శివ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.


