‘అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం’ | - | Sakshi
Sakshi News home page

‘అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం’

May 8 2026 11:02 AM | Updated on May 8 2026 11:02 AM

ఇచ్చోడ: రైతులు అధైర్యపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ పేర్కొన్నారు. మండలంలోని దుబార్‌పేట్‌లో ఇటీవల అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పంటలను గు రువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పంటల వివరాలు సేకరించాలని వ్యవసాయ సిబ్బందికి సూచించారు. నీ టి ఎద్దడిని నివారించాలని దుబార్‌పేట్‌లో గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. దీంతో వెంటనే స్పందించి బోరుబావికి భూమిపూజ చేశారు. అంతకుముందు సాథ్‌ నంబర్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించి మాట్లాడారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ఏనుగు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ నిమ్మల ప్రీతంరెడ్డి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్‌, నాయకుడు మహేందర్‌రెడ్డి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement