బోథ్: ధాన్యం దళారులకు అమ్ముకోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందా లని ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ సూచించారు. సొనాల మండల కేంద్రంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో బోథ్ పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసిన జొన్నల కొనుగో లు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, సర్పంచ్ బిందుజ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, స్థానిక నాయకుడు తుల శ్రీనివాస్ తదితరులున్నారు. కాగా, సొనాల మండలంలో పలు శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే తిరుగు ప్రయాణంలో స్థానికంగా గల చిన్నపాటి హోటల్ వద్ద ఆగారు. టీ తాగు తూ స్థానికులతో సరదాగా ముచ్చటించారు.
రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
నేరడిగొండ: మండలంలోని వడూర్ గ్రామం నుంచి దంస్యతండా వరకు రూ.15లక్షలతో చేపట్టిన గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రహదారి పనులు ప్రారంభం కావడంతో గ్రా మస్తులు హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని సు ర్దాపూర్ గ్రామంలోని హన్మాన్ ఆలయంలో నిర్వహించిన హన్మాన్ విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్యే హాజరై హోమం, ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. స్వా మివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్థానిక ప్ర జాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


