ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి మంజూల డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీం చౌక్‌లో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీ నామా చేయాలని డిమాండ్ చేశారు. బాధితురాలిపైనే కేసు పెట్టడం దారుణమని అన్నారు. ఇందులో విజయ, మీన, నర్మద, రాధ, ఆరీఫా బేగం, గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్ రాజీనామా చేయాలి
కై లాస్‌నగర్: తన తనయుడు భగీరథ్ కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్ర తినిధి బాలురి గోవర్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తీవ్రమైన ఆరోపణలపై విచారణ జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రి హోదాలో కొనసాగడం విచారణ ప్రక్రియను ప్రభావితం చేస్తుందన్నారు. ఇందులో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సంజయ్‌కుమార్, దేవిదాస్‌చారి తదితరులు పాల్గొన్నారు.


