జీవో నం.3 పునరుద్ధరించాలి | - | Sakshi
Sakshi News home page

జీవో నం.3 పునరుద్ధరించాలి

May 18 2026 7:03 AM | Updated on May 18 2026 7:03 AM

ఆదిలాబాద్‌టౌన్‌: షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఆది వాసీ యువతకు వంద శాతం రిజర్వేషన్‌ కల్పించే జీవో నం.3ను పునరుద్ధరించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీఏజీఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం న్యూ ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్‌ ఓరంను కలిసి ఆదివాసీ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 5వ షెడ్యూల్‌ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగాలను ఆదివాసీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలంటే జీవో నం.3 పునరుద్ధరణ అవసరమన్నారు. పీఎం జన్‌మన్‌, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అటవీ శాఖ అడ్డంకులు తొలగించాలని కోరా రు. ఈమేరకు మంత్రి సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సచిన్‌ తెలిపారు. ఆయన వెంట మాజీ రాజ్యసభ సభ్యురాలు బృందా కారత్‌, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి వెంకట్‌ పాల్గొన్నారు.

పెంచిన పెట్రో ధరలు తగ్గించాలి

ఆదిలాబాద్‌టౌన్‌: పెంచిన పెట్రో ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చే స్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం ఆందో ళన చేపట్టారు. బస్టాండ్‌ ఎదుట రాస్తారో కో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మల్లేశ్‌ మా ట్లాడుతూ, కేంద్రం గ్యాస్‌, పెట్రో ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. తక్షణమే ధరల పెంపును ఉపసంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో నా యకులు లంకా రాఘవులు, బండి దత్తాత్రి, సురేందర్‌, మంజుల, ఆరిఫాబేగం, రాములు, ఆశన్న, గంగారాం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement