కైలాస్‌నగర్: ఆదిలాబాద్ అర్బన్, మావల మండలాల పరిధిలోని 192 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం చె క్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు బండారి అనూష, బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, డీటీ శ్రీవాణి, ఆర్‌ఐలు యజువేందర్‌రెడ్డి, శశికళ, కౌన్సిలర్లు నరేశ్‌కుమార్, గంట జీవన్ తదితరులు పాల్గొన్నారు.
సాత్నాల మండలంలో..
సాత్నాల: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 42మంది లబ్ధిదారులకు ఆదిలాబాద్ ఎ మ్మెల్యే పాయల్ శంకర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబార క్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి, ఆర్‌ఐ రమేశ్, సర్పంచ్ సాయివర్మ తదితరులు పాల్గొన్నారు.
జైనథ్ మండలంలో..
జైనథ్: మండలంలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆ లయ ప్రాంగణంలో లబ్ధిదారులకు కలాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జైనథ్, బేల తహసీల్దార్లు నారాయణ, ప్రవీణ్‌కుమార్, సాత్నాల ఆర్‌ఐ సాయినాథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.


