నేరాల నియంత్రణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణకు చర్యలు

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

● జిల్లావ్యాప్తంగా నాకాబందీ ● 25 చెక్‌పోస్టులు ఏర్పాటు ● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. మంగళవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా నా కాబందీ నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పట్టణాల్లో 25 ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ, నంబర్‌ ప్లేట్‌, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ స్వయంగా చెక్‌పోస్టులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఇందులో ఆది లాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

తలమడుగు: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నా రు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ మంగళవారం త నిఖీ చేశారు. రికార్డులు పరిశీలించిన అనంతరం మాట్లాడారు.నకిలీ విత్తనాలు, గంజాయి అక్రమ ర వాణాను అరికట్టాలన్నారు. ఆయన వెంట రూరల్‌ సీఐ ఫణిదర్‌, ఎస్సై రాధిక, సిబ్బంది పాల్గొన్నారు.

రెండో విడత డ్రైవింగ్‌ లైసెన్స్‌ మేళా

ఆదిలాబాద్‌టౌన్‌: రెండో విడత మెగా డ్రైవింగ్‌ లైసె న్స్‌ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మాట్లాడారు. ఈ నెల 16వరకు సంబంధిత పోలీసు స్టేషన్లలో ఉట్నూ ర్‌, ఇంద్రవెల్లి, బజార్‌హత్నూర్‌ మండలాల యువకులు టూవీలర్‌ లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్‌, పదో తరగతి మెమో, అడ్రస్‌ప్రూఫ్‌ జిరాక్స్‌లను పోలీసు స్టేషన్‌లో అందజేయాలని సూచించారు. మొదటి విడతలో 205 మంది ఆదివాసీలకు డీజీపీ చేతుల మీదుగా లైసెన్సులు అందించినట్లు చెప్పారు. లర్నింగ్‌ లైసెన్స్‌ కోసం మీసేవలో నమోదు చేసుకోవాలని, ఇందుకోసం రూ.600 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement