కోఆప్షన్‌ ఎన్నిక ఎప్పుడో? | - | Sakshi
Sakshi News home page

కోఆప్షన్‌ ఎన్నిక ఎప్పుడో?

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

● ఆశావహుల్లో తప్పని నిరీక్షణ ● రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చ ● చైర్‌పర్సన్‌ నిర్ణయంపైనే అందరి దృష్టి

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కోఆప్షన్‌ ఎన్నిక అంశం చర్చనీయాంశంగా మారింది. దరఖాస్తులు స్వీకరించి 15 రోజులవుతున్నా ప్రత్యేక సమావేశం నిర్వహించకపోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్బంగా కూటమిగా ఏర్పడి ఆ పదవులను దక్కించుకున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీల్లో కో ఆప్షన్‌ పదవులపై సఖ్యత కుదరలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదే జాప్యానికి కారణమనే విమర్శలున్నాయి. మరోవైపు మున్సిపల్‌లో అత్యధిక స్థానాలను కై వసం చేసుకున్న బీజేపీ ఈ పదవులను ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

నాలుగు పదవులకు 27 మంది పోటీ

మున్సిపల్‌ పరిధిలో మొత్తం నాలుగు కో ఆప్షన్‌ పదవులకు ఎన్నిక జరగనుంది. ఇందులో రెండు జనరల్‌, మరో రెండు మైనార్టీలకు కేటాయించిన విషయం తెలిసిందే. వీటి కోసం గత నెల 17న మున్సిపల్‌ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 25వరకు దరఖాస్తులు స్వీకరించారు. 28 మంది పోటీకి సై అన్నారు. పరిశీలనలో నిబంధనల ప్రకారం లేని ఒక దరఖాస్తును తొలగించారు. మిగిలిన వాటిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల నుంచి అత్యధికంగా 20 మంది మాజీ కౌన్సిలర్లు, ఒక మాజీ సర్పంచ్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఎంఐఎం నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు బరిలో నిలిచారు. మొత్తంగా నాలుగు పదవులకు 27 మంది పోటీపడుతున్నారు. ఈమేరకు ఎన్నిక నిర్వహించి మెజార్టీ సభ్యుల మద్దతు పొందిన వారిని కోఆప్షన్‌ సభ్యులుగా ప్రకటించాలి.

బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు

కూటమిగా ఏర్పడి చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ పదవులను దక్కించుకున్న విషయం విదితమే. అధికారం చేపట్టి మూడు నెలలు గడువకముందే వారి మధ్య అభిప్రాయ బేధాలు బయటపడుతున్నాయి. అయితే దీనిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఆ పార్టీకి 21మంది కౌన్సిలర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల ఎక్స్‌ అఫిషియో ఓట్లతో కలిపి 23 సభ్యుల బలం ఉంది. మూడు పదవులను పార్టీ కై వసం చేసుకోవాలని గట్టి సంకల్పంతో ఉంది. నాలుగోది కూడా ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్‌కు మద్దతునివ్వాలని నిర్ణయించింది.

జాప్యంపై నిరాశ

దరఖాస్తుల పరిశీలన ముగిసిన నాటి నుంచి 14 రో జుల తర్వాత ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉందని పలువురు కౌన్సిలర్లు చెబుతున్నారు. అయి తే జాప్యం అవుతున్న తీరు చర్చనీయాంశంగా మా రింది. కమిషనర్‌ సెలవులో ఉండటంతోనే సమావేశ నిర్వహణలో ఆలస్యమైనట్లుగా కూటమి కౌన్సి లర్లు చెబుతున్నారు. మరోవైపు నిబంధనల ప్రకా రం నిర్వహించకుంటే కోర్టుకు వెళ్లాలని బీజేపీ భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది.

15 తర్వాత నిర్వహిస్తాం

మున్సిపల్‌ కమిషనర్‌ సెలవులో ఉండటంతో ప్ర త్యేక సమావేశం నిర్వహణకు వీలుపడలేదు. క మిషనర్‌ విధుల్లో చేరిన వెంటనే ఈ నెల 15తర్వాత ప్రత్యేక తేదీ ప్రకటించి సమావేశాన్ని నిర్వహిస్తాం. జాప్యంలో ఎలాంటి రాజకీయ కారణా లు లేవు. సభ్యుల ఎన్నిక పారదర్శకంగా నిబంధనల ప్రకారం జరిగేలా చర్యలు తీసుకుంటాం.

– బండారి అనూష, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

Advertisement
 
Advertisement
Advertisement