ఆదిలాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఈనెల 10న నిర్వహించనున్న ప్రధాని న రేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పా యల్ శంకర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా కోరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. ప్రతీ పోలింగ్ కేంద్రం, గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద, లాలా మున్నా, జోగు రవి, శ్రీకాంత్, కృష్ణయాదవ్, దినేష్ మటోలీయా, సాయి, రాకేష్ తదితరులున్నారు.
ముగిసిన ‘జనగణన’ శిక్షణ
కై లాస్‌నగర్: జనగణన–2027 నిర్వహణపై ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు నిర్వహించిన శిక్షణ మంగళవారంతో ముగిసింది. ఎంపిక చేసిన 400 మందికి 8 బ్యాచ్‌లుగా శిక్షణ అందించారు. స్థానిక టీటీడీసీలో నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ హాజరై గణన ప్రక్రియపై పలు సూచనలు చేశా రు. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పక్కాగా చేపట్టాలన్నారు. ఏ ఒక్క కుటుంబం తప్పిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ నెల 10వరకు స్వీయ నమోదుకు అవకాశం ఉన్నందున పట్టణంలోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, రిటైర్డు ఉద్యోగులు, విద్యావంతులు స్వ యంగా తమ వివరాలు నమోదు చేసుకోవా లని సూచించారు. 11 నుంచి ఇళ్ల వద్దకు వచ్చే ఎన్యూమరేటర్లకు ఎస్‌ఈఐడీని చూపిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్‌కుమార్, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.


