నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ● హెడ్‌ క్వార్టర్స్‌లో నేర సమీక్ష

ఆదిలాబాద్‌టౌన్‌: నకిలీ విత్తనాలు, గడ్డి మందులపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో నెలవారీ నేర సమీక్ష నిర్వహించి మాట్లాడారు. బక్రీద్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యా ల నిర్మూలనకు కృషి చేయాలని తెలిపారు. వర్టికల్‌ విధానం అమలు చేయాలని, రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లపై నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఈ కేసుల దర్యాప్తు, పురోగతి, విచారణ, శిక్షలపై సమీక్షించి ప్రతీ ఒక్కరికి సమాన విధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, రాత్రి వేళ గస్తీని మరింత పటిష్టం చేసి అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంబ్లింగ్‌ వంటి చర్యలను అరికట్టాలని పేర్కొన్నారు. నేరస్తుల ఫింగర్‌ప్రింట్లను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ సురేందర్‌రావు, ఉట్నూర్‌ ఏఎస్పీ రుత్విక్‌సాయి కొట్టె, శిక్షణ ఐపీఎస్‌ అధికారి రాహుల్‌కాంత్‌, డీఎస్పీలు శ్రీనివాస్‌, జీవన్‌రెడ్డి, ఇంద్రవర్ధన్‌, సీఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement