కై లాస్‌నగర్: ఈ నెల 20న నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువత సద్వి నియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష కోరారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మావలలోని చిలుకూరి లక్ష్మీగార్డెన్‌లో నిర్వహించనున్న ఈ మేళా నిర్వహణపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బందితో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉద యం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే మేళాలో వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపా రు. 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న మేళాను 18 నుంచి 33 ఏళ్లలోపు నిరుద్యోగ యువత సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్ విడుదల చేశారు. సమావేశంలో ఇన్‌చార్జ్ కమిషనర్ సందీప్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, స్టెప్ మాజీ సీఈవో వెంకటేశ్వర్లు, వసంత్ తదితరులు పాల్గొన్నారు.


