ఆదిలాబాద్‌టౌన్/ఇంద్రవెల్లి/నేరడిగొండ/తాంసి: జిల్లాలో గురువారం కురిసిన అకాల వర్షం అన్నదా తలను అవస్థలకు గురి చేసింది. ఆయా మార్కెట్ యార్డుల్లో రైతులు విక్రయించేందుకు తెచ్చిన ధా న్యం తడిసిపోయింది. చాలామంది రైతులు ముందుగానే ధాన్యం కుప్పలపై కవర్లు కప్పి జాగ్రత్తపడ్డారు. ఇంద్రవెల్లి మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు మొక్కజొన్నలు తెచ్చిన రైతులు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పారు. అయినప్పటికీ ధాన్యం తడవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆయా గ్రామాల్లో చేతికొచ్చిన జొన్న, మొ క్కజొన్న పంటలు వర్షానికి దెబ్బతిన్నాయి. నేరడిగొండ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆరబోసిన మక్కలు తడిసి ముద్దయ్యాయి. సకాలంలో ధాన్యం తూకం వేయకపోవడం, సరిపడా టా ర్పాలిన్లు లేకపోవడంతో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఇబ్బందులకు గురయ్యారు. తాంసి మండల కేంద్రంతోపాటు మండలంలోని గిరిగాం, పొన్నారి, వడ్డాడి, హస్నాపూర్, కప్పర్ల గ్రామాల్లోనూ వర్షం కురిసింది. తాంసి సబ్ మార్కెట్‌యార్డులో రైతులు విక్రయించేందుకు తెచ్చిన జొ న్న పంట తడిసిపోయింది. చాలామంది రైతులు ముందే ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పుకొని జాగ్రత్త పడ్డారు. మండలంలో చాలాచోట్ల జొన్నపంటలు గాలివానకు నేలవాలాయి.


