ఆదిలాబాద్‌టౌన్: ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ పే ర్కొన్నారు. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రిమ్స్‌లోని ఏఆర్‌టీ సెంటర్‌లో హెచ్‌ఐవీతో జీవిస్తున్న 18 మంది పేదలకు బుధవారం పౌష్టికాహారం పంపిణీ చేయగా నరేందర్ రాథోడ్ హాజరై మాట్లాడారు. ప్ర భుత్వ ఏఆర్‌టీ సెంటర్ ద్వారా అందించే మందులతో పాటు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చని భరోసా ఇచ్చారు. నా కో, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి నిర్దేశించిన 95:95:99 లక్ష్యాలను అధిగమించి జిల్లా ను ఆదర్శంగా నిలపాలని తెలిపారు. హెచ్‌ఐవీతో జీవిస్తున్న చిన్నారులకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. చిన్నారుల ఉన్నత విద్య, పెద్దలకు ఆసరా పెన్షన్ల కోసం సంబంధిత అధికారులకు నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారు క్రమం తప్పకుండా ఏఆర్ టీ సెంటర్‌లో మందులు తీసుకోవాలని, తద్వారా వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చని పేర్కొన్నారు. హెచ్‌ఐవీ బాధితులపై వివక్ష చూపకుండా సహకా రం అందించాలని సూచించారు. ఏఆర్‌టీ సెంటర్ డాక్టర్ పద్మిని ప్రియదర్శిని, సీపీఎం నాగరాజు, ఎన్జీ వో ప్రతినిధులు సాయినాథ్, భాగ్యలక్ష్మి ఉన్నారు.


