బాల్య వివాహాలతో బాలికల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవగాహన కల్పిస్తున్నా ఆగని పెళ్లిళ్లు కేసులు నమోదు చేస్తున్నా మారని తీరు
తల్లిదండ్రుల నిరక్షరాస్యత, పేదరికం, బాలికల భద్రతపై భయం, సామాజిక ఒత్తిళ్లు, మూఢనమ్మకాలు వంటి కారణాలు బాల్య వివాహాలకు దారి తీస్తున్నాయి. ‘ఆడపిల్ల భారం’ అనే పాతబడ్డ భావజాలం ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతుండడం పరిస్థితిని విషమంగా మారుస్తోంది. కుటుంబీకులు ఆరోగ్య సమస్యలతో సతమతం అవ్వడం, పిల్లల పెళ్లి కళ్లారా చూడాలనే కోరిక.. తదితర సెంటిమెట్లు కూడా కారణమవుతున్నాయి.
తల్లీబిడ్డలకు ప్రాణాపాయం..
చిన్న వయసులో గర్భం దాల్చడం ద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. తక్కువ బరువుతో శిశువులు పుట్టడం, పోషకాహార లోపం, రక్తహీనత, నెలలు నిండకముందే ప్రసవాలు, అధిక రక్తస్రావం వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. సాధారణ ప్రసవాలు తగ్గిపోవడంతో పాటు శస్త్ర చికిత్సలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. అలాగే చిన్న వయసులో గర్భం దాల్చిన మహిళల్లో గర్భస్రావాలు, కాన్పు సమయంలో మరణాల శాతం సాధారణ మహిళలతో పోల్చితే రెండింతలు అధికంగా ఉన్నట్లుగా పేర్కొంటున్నారు. అలాగే ప్రసవం తర్వాత కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతోందని చెబుతున్నారు.
పెరుగుతున్న శిశు మరణాలు..
బాల్య వివాహాలు జరిగిన తర్వాత వారి పిల్ల లు ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రసవ సమయంలో శిశు మరణాలు సైతం అధికంగా ఉంటున్నట్లుగా చెబు తున్నాయి. చిన్న వయసులో గర్భం దాల్చిన వారి లో ఏజెన్సీ, మారుమూల మండలాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. బాల్య వివా హాల నిర్మూలనకు చట్టాల అమలుతో పాటు సమాజంలో అవగాహన పెంపు, బాలికల విద్యకు ప్రాధాన్యత, తల్లిదండ్రుల్లో చైతన్యం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
పసిమొగ్గలనే పసుపు తాడుతో బంధిస్తున్నారు. బాల్య వివాహాలతో బాలికల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు సమీపిస్తున్నా ఇంకా చిన్నారి పెళ్లికూతుళ్లు దర్శనమి స్తూనే ఉన్నారు. అధికారులు అవగాహన కల్పిస్తున్నా
జిల్లాలో ఘటనలు చోటు చేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
– ఆదిలాబాద్‌టౌన్


