ఆదిలాబాద్‌రూరల్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రాష్ట్ర క్రీడలు, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసమే వేచి చూడకుండా, ప్రైవేటు రంగంలో ఉన్న అవకాశాలను ద్వినియోగం చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలన్నారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఇందులో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్, ఉపాధి కల్పన అధికారి మిల్కా, నిరుద్యోగులు పాల్గొన్నారు.


