ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
కై లాస్‌నగర్: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబి తాను 2002 ఎస్‌ఐఆర్ జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రా జర్షిషా అదేశించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం హైదరాబా ద్ నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధి కారులు, సంబంధిత అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి ఆ యన పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడుతూ, ప్రతీ నియోజకవర్గంలో బీఎల్‌వోల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అన్ని వనరులను సిద్ధం చేసుకోవాలన్నారు. మ్యాపింగ్ పురోగతిని పెంచేందుకు ప్రతి బుధవారం రాజ కీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించా లని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆ ర్‌వో స్రవంతి, ఆర్డీవో జగదీశ్వర్ రావ్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్: జనగణన–2027 ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం నిర్వహించిన ‘సెన్సెస్ వాక్’ (మారథాన్)ను ఆయ న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే 12వేల కుటుంబా లు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా వివరాలు నమో దు చేసుకున్నాయన్నారు. జూన్ 9 వరకు నిర్వహించే మొదటి దశ హౌస్‌లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. జిల్లాలోని 1,293 బ్లాకుల్లో ఎన్యూమరేటర్లు పర్యటిస్తారని, వారు అడి గే ప్రశ్నలకు ప్రజలు నిర్భయంగా, యథార్థమైన సమాచారం అందించాలని కోరారు. ప్రజలు ఇచ్చే సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం అత్యంత గోప్యంగా ఉంటుందని వెల్లడించారు. ఇది ప్రభు త్వ అభివృద్ధి పథకాల రూపకల్పనకు మాత్రమే ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారు తమ ఎస్‌ఈ ఐడీ చూపిస్తే ప్రక్రియ వేగవంతం అవుతుందని సూచించారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్.చిత్రు, రాజేశ్వర్, డీఆర్వో స్రవంతి, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
ఆదిలాబాద్‌రూరల్: వేసవి శిబిరాల్లో విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. విద్యా వారోత్సవాల సందర్భంగా మండలంలోని యాపల్‌గూడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరం, బడి బాట కా ర్యక్రమాలను సోమవారం ఆయన ప్రారంభించారు. తబలా, హార్మోనియం వాయించి విద్యార్థులను ఉత్సాహ పరిచారు. విద్యార్థులు ఆసక్తి మేర కు మ్యూజిక్, కోడింగ్, యోగా, క్రీడల్లో నైపుణ్యం సాధించాలన్నారు. అలాగే జనగణన ప్రక్రియకు ప్రజలంతా సహకరించాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు వినోద్‌రెడ్డి, సర్పంచ్ నీరోష్, ఉపసర్పంచ్ దత్తు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పార్వతి, ఎంఈవో రమేశ్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు.
స్కానింగ్ యంత్రాలు అందజేత
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించే సదరం శిబిరాల్లో చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించి, వైకల్య శాతాన్ని నిర్ధారించేందుకు గాను అత్యాధునిక స్కానింగ్ యంత్రాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన సెర్ప్ సీఈవో వాటిని జిల్లాకు పంపించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షి షా వాటిని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్‌కు అందజేశారు.


