సాత్నాల: మండలంలోని కాన్ఫా మెడిగూడ రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన జొన్న పంటను నూటికి నూరుశాతం ప్రభుత్వం కొనుగోలు చేసేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పంట కొనుగోలు కోటాను పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని గుర్తు చేశారు. జైనథ్ ఏఎంసీ చైర్మన్ అల్లూరి అశోక్‌రెడ్డి, తహసీల్దార్ జాదవ్ రామారావు, రైతులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణానికి భూమిపూజ
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని క్రాంతినగర్ కాలనీలో చేపట్టిన విట్టల రుకుంబాయి ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని పురాతన ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కౌన్సిలర్లు నరేశ్, జీవన్, కృష్ణ, రాకేశ్, అశోక్‌రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.


