విధుల్లో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో నిర్లక్ష్యం వద్దు

May 10 2026 7:46 AM | Updated on May 10 2026 7:46 AM

● క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరి ● ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నారు. ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం నిర్వహించిన పరేడ్‌ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి సూచనలు చేశారు. నిత్యం వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వం పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతీ శనివారం నిర్వహించే పరేడ్‌లో తప్పనిసరిగా పాల్గొని కవాతులో నైపుణ్యం సాధించాలన్నారు. యూనిఫామ్‌కు ఉన్న గౌరవాన్ని మరింత పెంచేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. 50ఏళ్లు పైబడిన సిబ్బందికి ప్రత్యేక యోగా కార్యక్రమం కూడా ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఎల్‌.జీవన్‌రెడ్డి, పోతారం శ్రీనివాస్‌, కమతం ఇంద్రవర్ధన్‌, సీఐలు నాగరాజు, ప్రేమ్‌కుమార్‌, ఫణిదర్‌, ప్రణయ్‌ కుమార్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు డి.వెంకటి, టి.మురళి, ఎన్‌.చంద్రశేఖర్‌, ఎస్సైలు, రిజర్వ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement