‘భగీరథ’ నచ్చట్లే.. చల్లని చెలిమె నీటికే జై | - | Sakshi
Sakshi News home page

‘భగీరథ’ నచ్చట్లే.. చల్లని చెలిమె నీటికే జై

May 17 2026 1:30 AM | Updated on May 17 2026 1:30 AM

ఆ గూడెంలో ఐదు కుటుంబాలు.. 25 మంది జనాభా ఉన్నారు. మిషన్‌ భగీరథ పైపులైన్‌ ఉన్నా వేసవి ఎండలకు అందులోని నీరు ప్లాస్టిక్‌ వాసనతో పాటు వేడిగా వస్తోంది. దీంతో గూడెంవాసులు ఆ నీటిని తాగలేక సమీపంలోని వాగులో ఓ చెలిమె ఏర్పాటు చేసుకున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా అక్కడి వెళ్లి ఆ నీటితోనే దాహార్తి తీర్చుకుంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం దొంగచింత పంచాయతీ పరిధిలోని రాజుగూడ వాసుల నీటిగోసను ప్రతిబింబించే దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్‌ మనిపించింది. కాగా, తమకు చల్లని రక్షిత నీటి సౌకర్యం కల్పించాలని స్థానికులు కన్నీబాయి, తదితరులు కోరుతున్నారు. – ఉట్నూర్‌రూరల్‌

Advertisement
 
Advertisement
Advertisement