ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షిషా పి లుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక వి ద్యావారోత్సవాల్లో భాగంగా బుధవారం రిమ్స్ ఆడిటోరియంలో ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని సర్పంచులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లకు నిర్వహించిన విద్యా అవగాహన సదస్సుకు హాజరై మా ట్లాడారు. ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంగన్‌వాడీ పి ల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని ప్రజా ప్రతినిధులను కోరారు. విద్యార్థులు మధ్యలో చదు వు మానేయకుండా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతీ పాఠశాలకు నిర్దేశించిన ఎన్‌రోల్‌మెంట్ లక్ష్యాలను చేరుకునేందుకు గ్రామాలు, వార్డుల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో రాజేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, డీఎల్పీవో ఫణీందర్, కోఆర్డినేటర్ అజయ్, అధికారులు పాల్గొన్నారు.
జనగణనను పకడ్బందీగా చేపట్టాలి
కైలాస్‌నగర్: జనగణన పకడ్బందీగా చేపట్టాలని క లెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్, బొక్కలగూడ కాలనీల్లో నిర్వహిస్తున్న జనగణన హౌస్ లిస్టింగ్ సర్వేను ఆకస్మికంగా పరిశీ లించారు. ప్రక్రియ క్రమపద్ధతిలో సాగుతుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 14నుంచి హౌ స్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్‌ఎల్‌వో) యాప్ ద్వారా డేటా నమోదు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో సాంకేతిక అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్ శ్రీహరిబాబు, ఫీల్డ్ ట్రైనర్ సుజాత్‌ఖాన్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు నవీన్‌కుమార్, సాయికృష్ణ ఉన్నారు.
ఘన వ్యర్థాల నిర్వహణ కఠినంగా అమలు
కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ–2026ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ స్థాయి సెన్సిటైజేషన్ వెబినార్‌లో కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్షించిన కలెక్టర్ పలు సూచనలు చేశారు. మే 5, 2026న జారీ చేసిన తాజా ఉత్తర్వులను జిల్లాలో అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేంక్షించబోమని హెచ్చరించారు. బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి నిబంధనల ప్రకా రం వారి ప్రాంగణాల్లోనే వ్యర్థాల ప్రాసెసింగ్ జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీవో రవీందర్ రాథో డ్, డీఎల్పీవో ఫణిందర్‌రావు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం తనిఖీ
తాంసి: మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులు పండించిన జొన్న పంటను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందవద్దని తెలిపారు. అదనపు కలెక్టర్ చిత్రు, మార్క్‌ఫెడ్ డీఎం మ హేశ్, డీఏవో శ్రీధర్‌స్వామి, ఏడీఏ శ్రీనివాస్, ఎంబీఐ శ్రీనివాస్, కొనుగోలు కేంద్రం ఇన్‌చా ర్జి శ్రీనివాస్, ఎంపీడీవో మోహన్‌రెడ్డి, తహసీ ల్దార్ లక్ష్మి, ఏవో రవీందర్ తదితరులున్నారు.


