ఆదిలాబాద్‌టౌన్: భూ మాఫియా మోసాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం భూ చట్టాలు, రికార్డులపై పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ నలంద ప్రియ అవగాహన కల్పించారు. భూ యాజమాన్య చరిత్ర, అమలులోకి వచ్చిన భూ చట్టాల పరిమితులతో పాటు ఇతర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భూ సంబంధిత కేసుల్లో చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సూపరింటెండెంట్‌ను ఎస్పీ శాలువాతో సన్మానించారు. ఇందులో ఉట్నూర్ ఏఎస్పీ రిత్విక్‌సాయి కొట్టే, డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, సీఐలు పాల్గొన్నారు.


