కాగజ్‌నగర్‌టౌన్: భక్తుల చిరకాల కోరిక నెరవేరింది. నిర్మల్ జిల్లా బాసర రైల్వేస్టేషన్ మీదుగా నడిచే 07189/90 నాందేడ్–ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ డివిజన్ అధికారులు ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 17న ధర్మవరం జంక్షన్‌లో ప్రారంభం కానుంది. 22న నాందేడ్ నుంచి రెగ్యులర్‌గా నడవనుంది. ఈ రైలులో 8 స్లీపర్, 6 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, 4 జనరల్ బోగీలు ఉంటాయి. ఇందులో దివ్యాంగులకు రాయితీ సౌకర్యం కల్పించారు.క్రమబద్ధీకరణ తర్వాత ఈ రైలుకు కొత్త నంబర్లు కేటాయించారు. 17635 నాందేడ్–ధర్మవరం వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతీ శుక్రవారం నాందేడ్‌లో బయలుదేరి 6:30 గంటలకు బాసర రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. ఇక్కడ రెండు నిమిషాల హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. 17636 ధర్మవరం–నాందేడ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతీ ఆదివారం ఉదయం 5:25కు బయలుదేరి 10:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 10:40కి బయలుదేరి సోమవారం తెల్లవారు జాము న 4:45 గంటలకు బాసరకు చేరుకుంటుంది. 4:47 గంటలకు నాందేడ్ బయలుదేరుతుంది. ఈ రైలు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, విజయవాడ, నెల్లూరు, గూడురు, తిరుప తి, పాకాల మార్గం గుండా నడుస్తుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని భక్తులకు ఎంతగానో ఉపయోగకరంగా మారనుంది.
పెద్దపల్లి జంక్షన్‌తో కనెక్టివిటి
17636 ధర్మవరం–నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా తిరుపతి నుంచి వచ్చే భక్తులకు పెద్దపల్లి జంక్షన్‌లో ప్రతీ ఆదివారం రాత్రి 11:55కు పెద్దపల్లిలో దిగిన భక్తుల కు 10 నిమిషాల వ్యవధిలో రాత్రి 12:05 గంటలకు వచ్చే 17035 కాజీపేట్–బల్లార్షా ఎక్స్‌ప్రెస్ ఎక్కి రామగుండం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌కు వెళ్ళవచ్చు. ఈ కొత్త రైలుతో పెద్దపల్లి జంక్షన్ నుంచి తిరుపతికి రైలు సౌకర్యం మరింత మెరుగుపడింది. ప్రతీ గురు, శుక్ర, శని, ఆదివా రాల్లో వరుసగా నాలుగు రోజులు వరంగల్–విజ యవాడ మీదుగా తిరుపతికి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. గురు, ఆదివారాల్లో రాత్రి 8గంటలకు 12762 కరీంనగర్–తిరుపతి బై వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, శుక్రవారం రాత్రి 10 గంటలకు 17635 నాందేడ్–ధర్మవరం వీక్లీ ఎక్స్‌ప్రెస్, శనివారం రాత్రి 10 గంటలకు 17633 నాందేడ్ తిరుచానూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి.


