ఏళ్లనాటి భూసమస్య పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ఏళ్లనాటి భూసమస్య పరిష్కారం

May 8 2026 11:20 AM | Updated on May 8 2026 11:20 AM

కై లాస్‌నగర్‌: కలెక్టర్‌ రాజర్షి షా చొరవతో భీంపూర్‌ మండలం గొల్లఘాట్‌ గ్రామానికి చెందిన గిరిజన రైతు మడావి గంగారాం ఏళ్లనాటి భూ సమస్య పరిష్కారమైంది. గంగారాంకు చెందిన తొమ్మిదెకరాల సాగు భూమి నిషేధిత జా బితా (ఇనాం భూమి)లో చేరింది. దీంతో పట్టా పొందడానికి అవకాశం లేకుండా పోయి ప్రభు త్వ ప్రయోజనాలు పొందలేకపోయాడు. బాధి త రైతు ఇటీవల కలెక్టర్‌ను కలిసి సమస్య వివరించి పరిష్కారించాలని కోరాడు. స్పందించిన కలెక్టర్‌ భూభారతి చట్టం ద్వారా సమస్య పరి ష్కరించాలని భీంపూర్‌ తహసీల్దార్‌ బానోత్‌ ర మేశ్‌ను ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయిలో వి చారణ చేపట్టిన అధికారులు ఆ భూమిని రైతు గంగారాం పేరిట నమోదు చేసి పట్టాదారు పా సుపుస్తకం అందజేశారు. దశాబ్దాల నాటి భూ సమస్య పరిష్కారం కావడంతో రైతు గంగా రాం ఆనందం వ్యక్తం చేశాడు. గురువారం కలెక్టర్‌ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశా డు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement