మౌలిక వసతుల కల్పనకు కృషి | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతుల కల్పనకు కృషి

May 18 2026 7:03 AM | Updated on May 18 2026 7:03 AM

● ఎంపీ గోడం నగేశ్‌

ఇచ్చోడ: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రత్యేక కృషి చేస్తుందని ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. మండలంలోని అడేగామ(బి)లో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిని ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్‌, సర్పంచ్‌ విశాల్‌, పార్టీ నాయకులు రాజు, మాదవ్‌ అమ్టె, జీవీ రమణ, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

ముఖరా(బి)లో పంచాయతీ భవనం ప్రారంభం

ఇచ్చోడ: గ్రామాల అభివృద్ధి కోసం పాలనాపరమై న ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ నగేశ్‌, ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ అన్నారు. మండలంలోని ముఖరా(బి)లో నిర్మించిన నూతన పంచాయతీ భవనాన్ని ఆదివారం వారు ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ఏనుగు కృష్ణారెడ్డి, గాడ్గే సుభాష్‌, మారుతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement