ఆదిలాబాద్‌టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. లైంగిక దాడికి గురైన మైనర్ బాలిక పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అనేందుకు ఇదే నిదర్శనమని ఆరోపించారు. గత ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు స్థానిక ఎమ్మెల్యేకు కనిపించకపోవడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కొప్పుల దేవన్న, కారం కార్తిక్, గెడం నగేశ్, కలగట్టు అనిల్, ఆది నారాయణ, కుమ్ర నగేశ్ తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరగా రామన్న వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నాయకులు మెట్టు ప్రహ్లాద్, రాఘవేంద్ర, లింగారెడ్డి, వెంకట్‌రెడ్డి, గణేశ్, లస్మన్న, సత్యనారాయణ, అడెల్లు తదితరులున్నారు.


