● మొదలైన వేసవి క్రీడా శిబిరాలు ● జిల్లావ్యాప్తంగా ఐదు చోట్ల షురూ ● పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ● నెలాఖరు వరకు ఆయా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ | - | Sakshi
Sakshi News home page

● మొదలైన వేసవి క్రీడా శిబిరాలు ● జిల్లావ్యాప్తంగా ఐదు చోట్ల షురూ ● పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ● నెలాఖరు వరకు ఆయా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ

May 6 2026 8:25 AM | Updated on May 6 2026 8:25 AM

● మొదలైన వేసవి క్రీడా శిబిరాలు ● జిల్లావ్యాప్తంగా ఐదు చోట్ల షురూ ● పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహణ ● నెలాఖరు వరకు ఆయా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ

కబడ్డీలో శిక్షణ ఇస్తున్న కోచ్‌

టేబుల్‌ టెన్సీస్‌ ఆడుతూ..

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబి రాలు అందుబాటులోకి వచ్చేశాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ గతేడాది నుంచి వీటిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏర్పాటు చేసిన శిబిరాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈనెలాఖరు వరకు జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ఆయా క్యాంప్‌లలో విద్యార్థులకు యోగా, కరాటే, వాలీబాల్‌, క్రికెట్‌, అథ్లెటిక్స్‌ వంటి పలు క్రీడలపై నిపుణుల ద్వారా శిక్షణ అందిస్తున్నారు. కేవలం క్రీడలకే పరిమితం కాకుండా, శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, జట్టు భావన, స్వీయరక్షణ వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు సాగుతున్న శిక్షణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తమ ప్రతిభకు పదును పెంచి మెరుగుపర్చుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో

శిబిరాలను ఏర్పాటు చేశారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఇచ్చోడ, బోథ్‌, నార్నూర్‌, ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న ఈ క్యాంపులకు 550 మంది హాజరవుతున్నారు. శిక్షకులు ప్రతీ విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించి వారికి తగిన మార్గదర్శనం అందిస్తున్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ప్రజలతో సత్సంబంధాలు పెంచాలనే ఉద్దేశంతో ఎస్పీ ఈ కార్యక్రమం చేపడుతున్నారు.

ఆత్మరక్షణ కళలు.. వివిధ క్రీడాపోటీలు

శిబిరంలో భాగంగా విద్యార్థులకు పోలీస్‌స్టేషన్‌ సందర్శనలు, పోలీసుల విధుల నిర్వహణపై ప్రత్యక్ష అవగాహన, ఆయుధాల వినియోగం, వాటి పనితీరు, పోలీసుల కఠిన శిక్షణ విధానాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించడంతో పాటు సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి ప్రేరణ కలుగుతుంది.

క్రికెట్‌ సాధనలో

చిన్నారులు

విద్యార్థులకు

మంచి వేదిక..

వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు ఇది మంచి వేదికగా నిలుస్తుంది. చెడు అలవాట్లు, మత్తు పదార్థాలు, మొబైల్‌ ఫోన్లు, వ్యసనాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించడం ఈ క్యాంప్‌ ప్రధాన ఉద్దేశం. శిక్షణతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో పాటు మానసిక, శారీరక దృఢత్వం పెంపొందుతుంది. ఈ శిబిరాల్లో క్రికెట్‌, టేబుల్‌ టెన్నీస్‌, ఆర్చరీ, వాలీబాల్‌, యోగా, కరాటే తదితర క్రీడాంశాల్లో శిక్షణ కల్పిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement