వివరాలు తీసుకుని గదులివ్వాలి | - | Sakshi
Sakshi News home page

వివరాలు తీసుకుని గదులివ్వాలి

May 14 2026 6:15 AM | Updated on May 14 2026 6:15 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఆధార్‌, ఫోన్‌ నంబర్లు తప్పనిసరిగా నమోదు చేసిన తర్వాతే గదులివ్వాల ని డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి సూచించారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదేశాల మేరకు పట్టణంలోని లాడ్జిల యజమానులు, నిర్వాహకులతో బుధవారం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సమావేశం ని ర్వహించి మాట్లాడారు. గంజాయి విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, పాత మొబైల్‌ ఫోన్లు సేకరించే నేరస్తులకు గదులు ఇవ్వవద్దని తెలిపారు. లాడ్జిల్లో బ స చేసిన వారి పూర్తి వివరాలను ప్రతీ వారం ఆ యా ఠాణాల్లో ఇవ్వాలని ఆదేశించారు. ఫొటో గుర్తింపు పత్రాలను భద్రపర్చుకోవాలని తెలి పారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించా రు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టణ సీఐలు సునీల్‌కుమార్‌, నాగరాజు, ఫణిధర్‌, ఎస్సైలు సంజయ్‌, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement