బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం | - | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం

May 6 2026 8:25 AM | Updated on May 6 2026 8:25 AM

● కనుగుట్టను సందర్శించిన కలెక్టర్‌ రాజర్షి షా

బోథ్‌: మండలంలోని కనుగుట్ట శివారులో ఇటీవల ప్రమాదవశాత్తు జొన్న, మొక్కజొన్న పంటలు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ మేరకు కలెక్టర్‌ రాజర్షి షా మంగళవారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. 19 మంది రైతులకు చెందిన 48 ఎకరాల మేర పంట నష్టపోయినట్లు గుర్తించారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని, విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు సరిగా లేని విషయాన్ని రైతులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఆ శాఖ అధికారులు కూడా అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదు చేయడంతో ఏఈపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశా రు. తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. పంట నష్టానికి సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి రైతులకు న్యా యం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆర్డీవో జగదీశ్వర్‌, తహసీల్దార్‌ సుభాష్‌ చందర్‌, సర్పంచ్‌ అనిత రాజేందర్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement