కాంగ్రెస్‌లో అన్ని వర్గాలకు సమన్యాయం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో అన్ని వర్గాలకు సమన్యాయం

May 11 2026 7:56 AM | Updated on May 11 2026 7:56 AM

● ఎస్సీ విభాగం ఉమ్మడి జిల్లా పరిశీలకుడు సుదర్శన్‌

కై లాస్‌నగర్‌: అన్ని వర్గాలకు సమన్యాయం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పనిచేస్తుందని ఎస్సీ విభా గం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిశీలకుడు సమతా సుదర్శన్‌ అన్నారు. పార్టీ బలోపేతంలో భాగంగా జిల్లా, రాష్ట్ర స్థాయి ఎస్సీ విభాగం పదవుల నియామకాల కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సుమారు వంద మంది ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచిం3చారు. డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌ జాదవ్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తోందని, ఎస్సీ వర్గాలకు పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి, వైస్‌చైర్మన్‌ తన్వీర్‌, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement