ఆదిలాబాద్‌టౌన్: సిమెంట్ పరిశ్రమను అమ్ముకునే కుట్రను కేంద్రప్రభుత్వం మానుకోవాలని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమ రక్షణ కో సం పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కలిసి రా వాలని కోరారు. సీసీఐ పునఃప్రారంభించేలా చూడాలని, లేకుంటే నిర్వాసిత రైతులకు భూ ములు తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశా రు. అలాగే యాజమాన్యం మున్సిపాలిటీ, వి ద్యుత్‌శాఖకు చెల్లించాల్సిన పన్ను, బిల్లుల బ కాయిలు వెంటనే చెల్లించాలన్నారు. అప్పటివరకు డిస్మెంటల్ పనులను నిలిపివేయాలన్నా రు. ఇందులో భాగంగా ఈనెల 11న ము న్సిపల్ కార్యాలయం ఎదుట, 14న విద్యుత్ శాఖ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో కోకన్వీనర్లు కొండ రమేశ్, అరుణ్‌కుమార్, జగన్‌సింగ్, ఈశ్వర్‌దాస్, దాసరి రమేశ్, బండి దత్తాత్రి, లోకారి పోశెట్టి, లంకా రాఘవులు, కిరణ్, సతీష్, ఆశన్న పాల్గొన్నారు.


