క్రీడాకారులకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు సన్మానం

May 14 2026 6:15 AM | Updated on May 14 2026 6:15 AM

ఆదిలాబాద్‌: హనుమకొండలోని జేఎన్‌ స్టేడియంలో నిర్వహించిన ‘3వ తెలంగాణ త్రోస్‌, జంప్స్‌, 400 మీటర్ల అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌–2026’లో విజేతలైన జిల్లా క్రీడాకారులను బుధవారం జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సన్మానించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి మాట్లాడారు. ‘రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు 10 పతకాలు సాధించారని, క్రీడాకారుల క్రమశిక్షణ, కోచ్‌ రాకేశ్‌ శిక్షణతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. హ్యామర్‌ త్రోలో అరుణ, విక్రమ్‌ సింగ్‌, షాట్‌పుట్‌లో చరణ్‌ బంగారు, జ్యోతీశ్వరన్‌, సౌమ్య, జ్యోతి, సంజన, ఖుషి రజత, వంశీ, సౌమ్య కాంస్య పతకాలు సాధించగా అసోసియేషన్‌ సెక్రటరీ రాజేశ్‌, పెటా ప్రెసిడెంట్‌ పార్థసారథి, పీడీ కృష్ణతో కలిసి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement