● 48 మంది విద్యార్థుల గైర్హాజరు ● కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
కై లాస్‌నగర్: వైద్య విద్యలో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష (నీట్) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 1700 మంది దరఖాస్తు చేసుకోగా వారి కోసం జిల్లా కేంద్రంలో ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు సాగింది. బయోమెట్రిక్ అటెండెన్స్ నేపథ్యంలో విద్యార్థులను ఉద యం 11నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. నిర్ణీత సమయం ము గిసిన వెంటనే గేట్లను మూసివేశారు. ఎండ తీవ్రత నేపథ్యంలో విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. వారిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చే సిన లోనికి అనుమతించారు. పరీక్షకు 1652 మంది హాజరుకాగా 48 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కేంద్రాల వద్ద పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ సంయుక్తంగా పరిశీలించారు. నిర్వహణపై ఆరా తీఽశారు. వారి వెంట అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్ చిత్రు, ఆర్డీవో జగదీశ్వర్‌రావు, కో–ఆర్డినేటర్ అశోక్ పాల్గొన్నారు.
ముగిసిన టీజీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష
ఆదిలాబాద్‌టౌన్: టీజీ ఆర్‌జేసీసెట్ ఆదివారం ప్ర శాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఇందు కోసం జిల్లా కేంద్రంలో 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంపీసీ, బైపీసీ కోర్సుల కోసం మొత్తం 4,617 మంది దరఖాస్తు చేసుకోగా, 3,426 మంది హాజరైనట్లు డీఈవో రాజేశ్వర్ తెలిపారు.


