ఆదిలాబాద్‌టౌన్: రైతుల సమస్యలపై రాజకీయాలు చేయవద్దని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో తలమడుగు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 3,180 (హైబ్రిడ్) మద్దతు ధరతో కొనుగోళ్లు చేపడుతోందని, రైతులు 14 శాతం తేమ మించకుండా పంటను తీసుకురావాలని సూచించారు. దళారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఇందులో మున్సిపల్ చైర్ పర్సన్ అనూష, బీజేపీ నాయకులు దయాకర్, మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


