ఆదిలాబాద్‌టౌన్: పుస్తక పఠనంతో జ్ఞానం పెంపొందుతుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. విద్యా వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాలలో శుక్రవారం గ్రంథాలయ దినోత్సవం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంటూ దినపత్రికలు, పుస్తకాలు చదవాలని సూచించారు. ప్రిన్సిపాల్ అతీఖ్ బేగం, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు.
బజార్‌హత్నూర్‌లో..
బజార్‌హత్నూర్: శాఖ గ్రంథాలయాలకు పక్కా భవనాలతో పాటు వసతుల కల్పనకు కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య అన్నారు. మండల కేంద్రంలో ని గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో లైబ్రేరియన్ రాజన్న, సర్పంచ్ సా యన్న, తదితరులు పాల్గొన్నారు.
పుస్తక పఠనంతో ఉజ్వల భవిష్యత్తు
ఆదిలాబాద్: పుస్తక పఠనంతో ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన– ప్రగతి ప్ర ణాళిక’ విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మట్లాడారు. విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి గ్రంథాలయాలను సందర్శించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. నిరంతరం గ్రంథాలయాన్ని సందర్శించే ఉత్తమ పాఠకులను అభినందించి, వారికి బహుమతులు అందజేశారు. అనంతరం గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఇందులో అదన పు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్ మల్లెపూల నర్సయ్య, లైబ్రేరియన్ శ్రీనివాస్, సిబ్బంది సతీశ్, విద్యార్థులు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.


