రోడ్డెక్కిన రైతులు | - | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కిన రైతులు

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

● జొన్న కొనుగోళ్లు చేపట్టాలని ఆందోళన ● మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్‌

కై లాస్‌నగర్‌(బేల): జొన్న, శనగ పంటలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు శనివారం రోడ్డెక్కి ఆందోళనకు దిగా రు. బేల మండలంలోని సిర్సన్న, కొబ్బాయి జాతీ య రహదారిపై బైఠాయించారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో సమాచారం అందుకున్న పో లీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారుల ను సముదాయించారు. మార్కెటింగ్‌ అధికారులతో మాట్లాడించి ఆందోళన విరమింపజేవారు. వీరి ఆందోళనకు బీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపింది. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడు తూ, పంట కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్ర భుత్వాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ఇందులో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

భోరజ్‌లో..

సాత్నాల: జొన్న కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. భోర జ్‌ మండలం మాండగడ జాతీయ రహదారిపై రా స్తారోకో నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ, పంటకోత పూర్తయినా కొనుగోలు కేంద్రాలు ప్రా రంభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. నాఫెడ్‌ అధికారులు వచ్చి కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇందులో రైతులు ప్రహ్లాద్‌, ఊషన్న, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘రైతులు రోడ్డెక్కితేనే పంటల కొనుగోళ్లు’

ఆదిలాబాద్‌టౌన్‌: రెతులు తమ పంటలను కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కితే తప్ప ప్రభుత్వంలో చలనం రావడం లేదని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాద వ్‌, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ నిరసనలు చేపట్టడంతోనే ప్రభుత్వం దిగివచ్చి కొనుగోళ్లు ప్రారంభించేందుకు చర్యలు చేపడతుందన్నారు. ఇందులో పార్టీ నాయకులు నారాయణ, ప్రహ్లాద్‌, రమేష్‌, గంగయ్య, ప్రశాంత్‌, దయానంద్‌, ఎస్‌కే కలీమ్‌ తదితరులున్నారు.

కై లాస్‌నగర్‌: రహదారిపై బైఠాయించిన రైతులు, బీఆర్‌ఎస్‌ నాయకులు

Advertisement
 
Advertisement
Advertisement