పకడ్బందీగా జొన్నల కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా జొన్నల కొనుగోళ్లు

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

కై లాస్‌నగర్‌(బేల): రైతులకు ఇబ్బందులు కలగకుండా జొన్న పంటను కొనుగోలు చేస్తామని మండల ప్రత్యేకాధికారి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌రావు పేర్కొన్నారు. బేల మండల కేంద్రంలోని సబ్‌ మార్కెట్‌ యార్డ్‌లో చేపట్టిన జొన్న కొనుగోళ్లను గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 30శాతం పంట కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన పంటను ఇక్కడే ఉన్న గోదాంలో నిల్వ చేస్తున్నామని పేర్కొన్నారు. గన్నీ సంచుల కొరతతో కొనుగోళ్లలో కొంత జ్యాపం జరుగుతోందని, రైతులు సొంతంగా గన్నీ బ్యాగ్‌లు సమకూర్చుకుంటే ఒక్కో సంచికి రూ.22 చెల్లించనున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement