పీజీఆర్‌ఎస్‌కు వెల్లువలా అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు వెల్లువలా అర్జీలు

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ సమావేశ భవనంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు అర్జీలు వెల్లువలా వచ్చాయి. మొత్తం 98 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్‌ కె.దినేష్‌ కుమార్‌ తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌కు 13 అర్జీలు వచ్చాయన్నారు. రాజవొమ్మంగి మండలం సింగంపల్లిలో నేషనల్‌ హైవే 516 నిర్మాణంలో భాగంగా నష్టపోయిన తమకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌కు ఎనిమిది బాధిత కుటుంబాలు అర్జీ అందజేశాయి. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ నీలవరం – వెదురులంక వీధి వరకూ వేసిన విద్యుత్‌ స్తంభాలకు సరఫరా అందించాలని, నీలవరం గ్రామానికి ఆశ వర్కర్‌ను నియమించాలని వైస్‌ ఎంపీపీ తుంబుడు లత, తుంబుడు సోమిరెడ్డి, తుంబుడు నరేందర్‌రెడ్డి కోరారు. ఎటువంటి ఆదాయం లేని తనకు వికలాంగ పింఛన్‌ మంజూరు చేయాలని అడ్డతీగల మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన బండి మరిడియ్య దరఖాస్తు సమర్పించారు. నిమ్మలపాలెం గ్రామంలో భూ సర్వే చేసి 74 మంది గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని బలిజ నాగిరెడ్డి, వెంకటరెడ్డి, సంకు అబ్బాయిరెడ్డి తదితరులు అర్జీ ఇచ్చారు. నోడల్‌ అధికారి తూతిక శ్రీనివాస్‌ విశ్వనాథ్‌, డీఆర్‌ఓ అంబేద్కర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement