బజార్‌హత్నూర్ మండలం గేర్జాయి గ్రామ పంచాయతీ పన్ను లక్ష్యం రూ.62,501 కాగా రూ.62,859 వసూలు చేశారు. వంద శాతం లక్ష్యాన్ని దాటింది. అదనంగా మరో రూ.358 వసూలు చేశారు.
ఇంద్రవెల్లి మండలం మార్కగూడ గ్రామపంచాయతీ వార్షిక పన్ను లక్ష్యం రూ. 69,471 కాగా ఇక్కడ రూ.70,071 వసూలు చేఽశారు. ఇది లక్ష్యానికంటే రూ.600 అధికం.
వీటితో పాటు జిల్లాలో మరో 23 జీపీలు వందశాతానికి మించి పన్నులు వసూలు చేసి ఆదర్శంగా నిలిచాయి.
మరో 25 గ్రామాల్లో లక్ష్యానికి మించి పన్ను వసూలు ఒక శాతం దూరంలో 20 గ్రామాలు అత్యధికంగా ఆదివాసీ పంచాయతీలే
కై లాస్‌నగర్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆస్తి పన్ను వసూళ్ల గడువు ఇటీవల ముగిసింది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసిన విషయం తెలిసిందే. అయితే పన్ను వసూలు లక్ష్య సాధన కోసం మరో 15 రోజుల పాటు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇది కూడా ఇటీవల ముగియగా జిల్లాలోని 217 జీపీలు శతశాతం వసూలు చేసి ఆదర్శంగా నిలి చాయి. ఇందులో 25 పంచాయతీలు వందశాతానికి మించి వసూలు చేయడం గమనార్హం. లక్ష్యం చేరిన జీపీల్లో అత్యధికంగా ఆదివాసీ గ్రామాలే ఉండటం గిరిపుత్రుల బాధ్యత, చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అన్ని వసతులున్న మైదాన ప్రాంతాల్లోని పంచాయతీలు పన్నుల చెల్లింపులో వెనుకబడడం విస్మయానికి గురిచేస్తోంది.
వందశాతం వసూలు ఇలా..
జిల్లా వ్యాప్తంగా 473 పంచాయతీలు ఉండగా ఇందులో 192 వంద శాతం పన్నులు వసూలు చేశాయి. మరో 25 గ్రామాల్లో లక్ష్యానికి మించి వ సూలు చేసి ఆదర్శంగా నిలిచాయి. మరో 20 గ్రా మాలు లక్ష్యానికి 99శాతంతో అడుగుదూరంలో నిలిచాయి. మిగతా పంచాయతీల్లో 57 నుంచి 98 శాతం వరకు వసూలైనట్లుగా అధికారిక లెక్కలు చె బుతున్నాయి. వందశాతం పన్నులను వసూలు చేసి న గ్రామాల్లో ఇచ్చోడ, ఇంద్రవెల్లి, భీంపూర్ మండలాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇక్కడి మెజార్టీ గ్రామాలు ఏజెన్సీ అయినా వందశాతం పన్ను చెల్లించి బాధ్యత, చైతన్యాన్ని చాటుకున్నాయి.
జిల్లాలో ఇలా..
జిల్లావ్యాప్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరానికి 85.15 శాతం పన్నులు వసూలయ్యాయి. ఆయా పంచాయతీల పరిధిలో 1,79,236 ఆస్తులు ఉండగా వీటికి సంబంధించి మొత్తం రూ.6కోట్ల71లక్షల 58వేల 878 పన్ను లక్ష్యంగా ఉంది. ఇందులో రూ.6కోట్ల 39లక్షల 90వేల 446 వసూలు చేశారు. రూ.77లక్షల 85వేల 330 బ్యాలెన్స్‌గా మిగిలాయి.
మండలాల వారీగా శతశాతం పన్ను వసూలు చేసిన జీపీల వివరాలు
వందశాతం లక్ష్యంగా ముందుకు
ప్రతీ పంచాయతీలో వందశాతం పన్నులు వసూలు లక్ష్యంగా ప్రయత్నించాం. మెజార్టీ జీపీల్లో లక్ష్యాన్ని సాధించినప్పటికీ కొన్ని చోట్ల వెనుకబడ్డాం. వచ్చే ఏడాది వందశా తం అధిగమించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతాం. ప్రజలు సైతం స్వ చ్ఛందంగా పన్ను చెల్లించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలి. – ఫణిందర్‌రావు,
జిల్లా ఇన్‌చార్జి పంచాయతీ అధికారి
మండలం పంచాయతీల
సంఖ్య
సిరికొండ 10
తాంసి 05
భీంపూర్ 17
ఆదిలాబాద్‌రూరల్ 16
జైనథ్ 07
నార్నూర్ 15
ఇంద్రవెల్లి 21
గుడిహత్నూర్ 12
ఇచ్చోడ 31
బజార్‌హత్నూర్ 15
బోథ్ 08
నేరడిగొండ 11
సొనాల 04
సాత్నాల 07
భోరజ్ 06
గాదిగూడ 06
తలమడుగు 07
బేల 10
ఉట్నూర్ 09


