ఆదిలాబాద్‌టౌన్: దేశ వ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పేపర్ లీకేజీ ఘటన దారుణమని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మెస్రం భాస్కర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కా ర్యాలయంలో మంగళవారం ముఖ్య నాయకుల స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో జిల్లా నాయకులు సచిన్, వెంకటేశ్, ఇర్ఫాన్, వేణు, రవి, దిగంబార్ తదితరులు పాల్గొన్నారు.


