విన్నపాలు వినవలె | - | Sakshi
Sakshi News home page

విన్నపాలు వినవలె

May 11 2026 11:56 PM | Updated on May 11 2026 11:56 PM

● ప్రజావాణికి 75 అర్జీలు ● దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్‌

కై లాస్‌నగర్‌: ప్రజావాణి పోర్టల్‌లో నమోదయ్యే ప్ర తీ ఫిర్యాదును నిర్దిష్ట గడువులోపు పరిష్కరించి బా ధితులకు సాంత్వన చేకూర్చాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వారి స మస్యలు అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ త్వరి తగతిన పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, సామాజిక భద్రతా పింఛన్లు, ఉపాధి హామీ పనులు, భూభారతి స మస్యలు వంటి అంశాలకు సంబంధించి మొత్తం 75 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్‌ చిత్రు, ఎస్‌.రాజేశ్వర్‌, డీఆర్వో స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..

Advertisement
 
Advertisement
Advertisement