నియోజకవర్గ అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ అభివృద్ధికి కృషి

May 11 2026 11:56 PM | Updated on May 11 2026 11:56 PM

ఇచ్చోడ: నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తున్నానని బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలో రూ.21లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతీ గ్రామానికి సీసీ రోడ్డు, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కొడప జలైజాకు, ఉప సర్పంచ్‌ శిరీష్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకుడు కృష్ణారెడ్డి, పీఎసీఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు శివకుమార్‌రెడ్డి, సుభాష్‌,తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement