బోథ్: మండలంలోని కనుగుట్ట గ్రామంలో ఇ టీవల జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన మొక్కజొన్న, జొన్న పంటలను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ గురువారం పరిశీలించారు. పంట నష్టపోయిన రైతు కుటుంబాలను పరా మర్శించి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన నష్టాన్ని ఎంపీకి వివరించి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూడాలని వేడుకున్నారు. ఎంపీ వెంటనే ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. పంట న ష్టాన్ని త్వరగా అంచనా వేసి బాధితులను ఆ దుకోవాలని ఆదేశించారు. గ్రామస్తుల వినతి మేరకు బోథ్ నియోజకవర్గ కేంద్రంలో అగ్ని మాపక కేంద్రం (ఫైర్ స్టేషన్) ఏర్పాటుపై ఎంపీ సానుకూలంగా స్పందించారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. నాయకులు బోరే రవీందర్, జీవీ రమణ, పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ మాజీ సభ్యులు పాల్గొన్నారు.


