సీసీఐ నిర్వాసితులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీసీఐ నిర్వాసితులకు న్యాయం చేయాలి

May 4 2026 7:13 AM | Updated on May 4 2026 7:13 AM

● మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్‌టౌన్‌: సీసీఐ భూ నిర్వాసితులకు న్యా యం చేస్తూ సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభించాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ‘సీసీఐ పరిశ్రమ కొత్త పరిణామాలు– మన కర్తవ్యం’ అంశంపై ఆదివారం చర్చావేదిక ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. పరిశ్రమ పునరుద్ధరణతో యువతకు ఉపాధి అవకాశాలతో పాటు అనేక కుటుంబాలు జీవనోపాధి పొందుతాయని అన్నారు. ప్రస్తుతం పరిశ్రమను తుక్కు కింద అమ్మే ప్రయత్నం జరుగుతుందని, దానిని సహించబోమని పేర్కొన్నారు. అవసరమైతే నిర్వాసితులతో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే ఇళ్లను ము ట్టడిస్తామన్నారు. సమావేశంలో సీసీఐ సాధన కమి టీ నాయకులు విజ్జగిరి నారాయణ, కొండ రమేశ్‌, బండి దత్తాత్రి, నర్సింగ్‌, అరుణ్‌కుమార్‌, చారి, రాఘవులు, కిరణ్‌, తరుణ్‌కుమార్‌, రమేశ్‌, వెంకట్‌నారాయణ, పోశెట్టి, ప్రహ్లాద్‌, ప్రేమల, ఈశ్వర్‌, నర్సింగ్‌, శివ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement