మారుమూల గ్రామాల సందర్శన | - | Sakshi
Sakshi News home page

మారుమూల గ్రామాల సందర్శన

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

ఆదిలాబాద్‌రూరల్‌: మండలంలోని మారుమూల గ్రామాలైన వాన్‌వాట్‌ పంచాయతీ పరిధి మంగ్లీ, అసోదా పంచాయతీ పరిధి బుర్కి గ్రామాలను ఐటీడీఏ పీవో మంద మకరందు గురువారం సందర్శించారు. మంగ్లీకి రోడ్డు సౌకర్యం సరిగా లేక సుమారు నాలుగు కిలోమీటర్లు బైక్‌పై వెళ్లారు. బైక్‌ కూడా వెళ్లడానికి వీలు లేని ప్రాంతం నుంచి కాలినడకన గ్రా మానికి చేరుకున్నారు. గ్రామస్తుల సమస్యలు తెలు సుకుని దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వా రా లబ్ధి చేకూరేలా చూస్తామని తెలిపారు. పీవీటీజీ ఏపీవో భాస్కర్‌, తహసీల్దార్‌ గోవింద్‌, ఐటీడీఏ ఈ ఏ సతీశ్‌, ఆర్‌ఐ శకుంతల, వాన్‌వాట్‌, అసోదా బు ర్కి సర్పంచులు మెస్రం భుజంగ్‌రావ్‌, మెస్రం నా గోరావ్‌, ఏఈలు ఆదిత్య, గణేశ్‌ తదితరులున్నారు.

ఆత్మీయ సమ్మేళనం

ఉట్నూర్‌ రూరల్‌: ఉట్నూర్‌ పరిధిలోని కుమరం భీమ్‌ కాంప్లెక్స్‌లో తోటి, కోలాం సర్పంచులు, వార్డ్‌ సభ్యులు, మేధావులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈటీడబ్ల్యూ తానాజీ, మండల అధికారి గంగాధర్‌, ఏపీవో జనరల్‌ వసంతరావు, ఏపీవో పీవీటీజీ భాస్కర్‌, డీడీ అంబాజి, వైద్యారోగ్యశాఖ అధికారి మనోహర్‌తో కలిసి ఐటీడీఏ పీవో మకరందు హాజరయ్యారు. పీవీటీజీ, కోలాం, తోటి, ఆది వాసీ గిరిజనులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చే దరఖాస్తుదారులకు సమయం కేటాయిస్తానని తెలిపారు. విద్య, వైద్యం కోసం ప్రజల నుంచి ఒక నాయకుడిని ఎంపిక చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement