కైలాస్‌నగర్: కాంగ్రెస్ మండ ల, పట్టణ అధ్యక్షులను పార్టీ అ ధిష్టానం ఎట్టకేలకు ఖరారు చే సింది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపే తం చేయడమే లక్ష్యంగా పార్టీకి విధేయులుగా ఉన్న వారికి పదవులు కట్టబెట్టింది. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేశ్‌జాదవ్ పంపించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయి తే, ఇదివరకు ఆదిలాబాద్ పట్టణానికి అధ్యక్షుడు ఉండగా కొత్తగా ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండల కేంద్రాలకూ వేరుగా అధ్యక్షులను నియమించడం ప్రా ధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలంగా ఊ రిస్తూ వస్తున్న పదవులను ఎట్టకేలకు భర్తీ చేయడంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. త్వరలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్న నేపఽథ్యంలో పార్టీ మండలాధ్యక్షులను నియమించడం కాంగ్రెస్‌కు కలిసిరానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా, కొత్త అధ్యక్షులు మండలంలోని నా యకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని పటిష్టం చేయాలని కోరారు.
నూతన అధ్యక్షులు వీరే..
మండలం అధ్యక్షుడి పేరు
ఆదిలాబాద్‌రూరల్ వెంకటేశ్‌యాదవ్
జైనథ్ జి.జగదీశ్‌రెడ్డి
బేల రూప్‌రావు
మావల కుదురుపాక సురేశ్
భోరజ్ బత్తుల శ్రీనివాస్
సాత్నాల కనక బాపురావు
ఆదిలాబాద్ ఖిజర్ పాషా
ఇంద్రవెల్లి ఎండీ జహీర్
ఇంద్రవెల్లిటౌన్ సోన్‌కాంబ్లేజితేందర్
ఉట్నూర్ దాసండ్ల ప్రభాకర్
ఉట్నూర్‌టౌన్ సయ్యద్ నిసార్
భీంపూర్ దండే సుదర్శన్
తలమడుగు కసుల ప్రతాప్
తాంసి కౌడాల సంతోష్
సిరికొండ షేక్ ఇమామ్
బజార్‌హత్నూర్ కళ్లెం విఠల్
ఇచ్చోడ ఆసిఫ్ ఉల్లాఖాన్
నేరడిగొండ ఏలేటి రాజశేఖర్‌రెడ్డి
బోథ్ నల్ల శ్రీకాంత్‌రెడ్డి
గుడిహత్నూర్ తొడసం దౌలత్‌రావ్
సొనాల గాజుల పోతన్న
నార్నూర్ చౌహాన్ గోవింద్‌రావు
గాదిగూడ గెడం పరశురాం


