వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం అధికంగా ఉండనుంది. | - | Sakshi
Sakshi News home page

వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం అధికంగా ఉండనుంది.

May 11 2026 11:56 PM | Updated on May 11 2026 11:56 PM

వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతీవ్రత పెరగనుంది. ఉక్కపోత ప్రభావం అధికంగా ఉండనుంది.

‘సీసీఐ’కి నోటీసులు జారీ చేయాలి

ఆదిలాబాద్‌టౌన్‌: సీసీఐ సిమెంట్‌ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం తుక్కు కింద విక్రయిస్తుంటే విద్యుత్‌, మున్సిపల్‌ శాఖాల పెండింగ్‌ బకాయిలు ఎవరు చెల్లిస్తారని సీసీఐ సాధన కమిటీ కన్వీనర్‌ దర్శనాల మల్లేశ్‌ ప్రశ్నించారు. విద్యుత్‌ శాఖ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్యులకు రూ.2వేల కరెంట్‌ బిల్లు పెండింగ్‌ ఉంటే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్న అధికారులు సీసీఐ సంస్థ మాత్రం రూ.18 కోట్లు బకాయిలు ఉన్నా ఎందుకు వసూలు చేయడం లేదని అన్నారు. సామాన్యులకు ఒక న్యాయం.. బడాబాబులకు ఒక న్యాయమా అని మండిపడ్డారు. సీసీఐ ఫ్యాక్టరీని తుక్క కింద వి క్రయించిన తర్వాత ఈ బకాయిలను ఎలా వసూలు చేస్తారని, యాజమన్యానికి బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్‌ శాఖ అధికారి జేఆర్‌ చౌహాన్‌కు సీసీఐకి నోటీసులు ఇవ్వాలంటు వినతిపత్రం అందించారు. ఇందులో సాధన కమిటీ నాయకులు బండి దత్తాత్రి, లోకారి పోశేట్టి, దాసరి రమేశ్‌, స్వరూప, మమత, జగన్‌ సింగ్‌, గోవర్ధన్‌, బొర్రన్న, సచిన్‌, పర్వీన్‌ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తు చేసుకోండి

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ ట్రేడ్‌ కోర్సుల్లో శిక్షణ పొందేందుకు ఆసక్తి, అర్హత గల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 నుంచి జూన్‌ 8వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. కోపా, డ్రెస్‌మేకింగ్‌, స్టెనోగ్రాఫర్‌, ఎలక్ట్రీషియన్‌ కోర్సులో శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు 8500465816 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement